సుధీర్ ఆనంద్ ఎవరు ?

Sudigali sudhir biography

Personal  information

పూర్తి పేరు  :  సుధీర్ ఆనంద్

పుట్టిన తేదీ : 19 మే , 1987

స్థలం         : విజయవాడ

తండ్రి         : దేవ్ ఆనంద్

తల్లి           : నాగరాణి

అక్క          : శ్వేత

తమ్ముడు    : రోషన్

 

సుధీర్ ఆనంద్  19 మే, 1987 వ సంవత్సరంలో విజయవాడలో జన్మించాడు. సుధీర్ ఆనంద్ తల్లిదండ్రులు దేవ్ ఆనంద్ మరియు నాగరాణి. ఇతని అక్క పేరు శ్వేత మరియు తమ్ముడు రోషన్ ఉన్నారు.

సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ / Sudigali sudhir family

సుధీర్ తండ్రి దేవ్ ఆనంద్ ఒక సినిమా థియేటర్ లో మేనేజర్ గా పని చేసేవాడు. అందువలన వారికి ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు. తల్లి నాగరాణి గృహిణి. సుధీర్ ఆనంద్ తను 5వ తరగతి లో ఉన్నపుడు తన మామయ్య నేర్పిన magic ను ఒక ప్రోగ్రామ్ లో ప్రదర్శించాడు. అప్పుడు ఆ మ్యాజిక్ చూసినవారు తనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు.

ఆడబ్బులను తన geometry box లో పెట్టుకుని అది తన మొదటి సంపాదన గా 93 రూపాయలు తన తండ్రి దేవ్ ఆనంద్ కు ఇచ్చాడు. అయితే సుధీర్ వాళ్ల ఇంటి దగ్గర ఉన్నప్పుడు jokes చేసేవాడు మరియు అందరిని నవ్విస్తూ ఉండేవాడు.

అయితే అప్పుడు తన తల్లి కి సుధీర్ తెరపై చూడాలని ఒక కోరిక కలిగింది. సుధీర్ కూడా చాలా సినిమాలు చూసేవాడు. సుధీర్ కు కూడా ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని కోరిక కలిగింది. అయితే తన తల్లి చెప్పిన మాటలు మరియు తన కోరిక సుధీర్ ను మరింత బలపరిచాయి.

సుధీర్తన 10వ తరగతి పూర్తి అవగానే తన అక్క మరియు తమ్ముణ్ణి చదివించడం వలన ఇంట్లో ఖర్చులు ఎక్కువ అయ్యాయి. తన ఇంట్లో ఖర్చులు ఎక్కువ రాబడి తక్కువ అయ్యింది.  ఆ తర్వాత వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దిగజారుతు వచ్చింది.

సుడిగాలి సుధీర్ జీవితం / sudigali sudhir career / sudigali sudhir biography

సుధీర్ తన 10వ తరగతి పూర్తి అవగానే హైదరాబాద్ వచ్చి కృష్ణ నగర్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సుధీర్ కి ఎవరినీ కాలవాలో తెలియక మరియు ఎవరు తెలిసిన వారు లేకపోవడంతో తిరిగి విజయవాడ కు వెళ్లిపోవడం జరిగింది. సుధీర్ ఇంటర్ లో MPC తీసుకున్నాడు. మొదటి సంవత్సరం fail అయ్యాడు.

Dance

ఆ తరువాత తన కు తెలిసిన కొన్ని Dance స్టెప్ లు కొందరి పిల్లలకు నేర్పేవాడు. అలానే సుధీర్ మరి కొన్ని స్టెప్ లు నేర్చుకొని  స్కూల్ లో పిల్లలకు నేర్పడం మొదలుపెట్టాడు. అలా సుధీర్ తన రెండవ సంవత్సరం కూడా fail అయ్యాడు. సర్రిగా అప్పుడు తన తండ్రి కి car accident  జరిగింది. అప్పుడు తన కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోతోంది.

అప్పుడు సుధీర్ పెద్ద కొడుకు గా బాధ్యతలు తీసుకోవాలని తన తమ్ముడిని చదివించడం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ తనకు తెలిసిన మ్యాజిక్ ను ప్రదర్శించి ramoji film city లో 2004 డిసెంబర్ న జాయిన్ అయ్యాడు. అప్పుడు తన జీతం 15,000.

ఫ్యామిలీ టూర్

ఆ తరువాత కుటుంబాన్ని తానే పోషించడం జరిగింది.  అయితే ramoji film city లో ఎక్కువగా సెలవులు ఇవ్వరు. కాబట్టి రెండు సంవత్సరాలు పని చేశాడు. కేవలం ఒక సంవత్సరం లో నాలుగు రోజులు మాత్రమే సెలవులు తీసుకున్నాడు. అలా తన జీతం 30,000 లకు పెరిగింది. ఇలా కొన్నాళ్లు అయిన తరువాత ఇలాగే ఉంటే తను బయట ప్రపంచనికి తెలియదని అమీర్ పెట్ లో ఉన్నాడు.

తన కోరిక అయిన సినిమా రంగం కోసం చాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం లో శీను పరిచయమయ్యాడు. సుధీర్ సినిమాలో అవకాశం కోసం చాలా కష్టపడ్డాడు. అలా తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి.

సుధీర్ కు తినడానికి డబ్బులు లేక పోయినా sink లో నీళ్లు తాగాడు. సుధీర్ దగ్గర ఆర్థిక స్థోమత చాలా తగ్గిపోయింది. సుధీర్ తిరిగి విజయవాడ కు బయల్దేరాడు.

మేజిసియాన్ ఎలా అయాడు & ఎందుకు ? / How sudhir become Magician and why ?

సుధీర్ గురించి తెలుసుకున్నా తన మామయ్య తన మ్యూజిసియాన్ గురువు అలీ తన దగ్గర శిషుడిగా నేర్చుకోమని అడిగాడు. ఆ తరువాత హైదరాబాద్ కి వెళ్లి అలీ దగ్గర

మ్యాజిక్ షో లు చేస్తూ Hindi & English  భాషాలను నేర్చుకున్నాడు.

ఇలా కొద్దీ కాలం తర్వాత తానే స్వయంగా ఒక కంపెనీ ని

తయారుచేసికొని event లు చేసుకోవడం మొదలు పెట్టాడు.

అలా సుధీర్ కు డబ్బులు రావడం మొదలైంది. తర్వాత కుటుంబాన్నీ

పోషించాడు. కానీ తన తల్లి అన్న మాటలు మాత్రం సుధీర్ ని సంతోషo

పెట్టలేదు. 2013 వ సంవత్సరం లో ఫిబ్రవరి లో జబర్దస్త్ షో మొదలైంది.

అప్పుడు నల్ల వేణు శ్రీను కి ఫోన్ చేసి “నువ్వు నాకు కొంచెం supporter

గా ఉండాలని చెప్పాడు”. కానీ అప్పుడు శ్రీను లోకల్  tv లో రిపోర్టర్ గా

పని చేసేవాడు. కావున పోవడం కుదరలేదు. “కానీ నా  స్నేహితుడు

సుధీర్ ఉన్నాడు” అని చెప్పాడు.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ

సుధీర్ కి ఫొన్ చేసి శ్రీను రేపు షూటిం షూటింగ్ ఉంది,  వెల్లమన్నాడు. కానీ సుధీర్ అదేరోజు ఒక  ఈవెంట్ ఉంది. అది అయిపోయాక సాయంత్రం వెళ్ళాడు. వేణు అంతలోపు వేరే వాళ్ళను పెట్టాడు.

అప్పుడు సుధీర్ సరేలే అని వాళ్ళ రిహార్సల్స్ ని చూస్తున్నాడు. అప్పుడు సుధీర్ కి ఆకలి వేసి బయటకు వెళ్ళాడు. వేణు తన కారులో సుధీర్ ని ఎక్కించుకుని

సుధీర్ ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఉంది చేస్తావా

అని అడిగాడు. అప్పుడు సుధీర్ చేస్తా అని తన acting ను చూపించాడు. ఆ తరువాత

వేణుతో ఆ స్కిట్ బాగా చేశారు. అలా కొద్ది కాలం తర్వాత సుధీర్, రాంప్రసాద్, శ్రీను, సన్నీ

ఒక టీం అయ్యారు. దానికి సుధీర్ లీడర్ గా ఉన్నాడు. కొంతకాలం తర్వాత సుధీర్ కు

అడ్డ సినిమా లో క్యారెక్టర్ వచ్చింది, దానికి తను చాలా సంతోష పడ్డాడు.

సుడిగాలి సుధీర్ మూవీస్ లిస్ట్ / Sudigali sudhir movies list

అలా కొద్దీ సినిమాలో అవకాశాలు వచ్చాయి. అవి రేసుగుర్రం, చక్కిలిగింత, టైగర్, బ్రదర్ఆఫ్ బొమ్మాలి, వేర్ ఐస్ విద్యాబాలన్, సుప్రీం, నేను శైలజ, సినిమా చూపిస్తా మావ, దృశ్య కావ్యం, సర్దార్ గబ్బర్ సింగ్, సెల్ఫి రాజా, middle క్లాస్ అబ్బాయి, ఓం నమః వెంకటేషయా, బంతిపుల జనకి, నేనోరకం, ఎందుకో ఏమో మొదలగు సినిమాలు చేశాడు.

సుడిగాలి సుధీర్ అని ఎలా వచ్చింది

ఒక రోజు సర్దార్ సెట్ కి చిరంజీవి గారు వచ్చినప్పుడు సుధీర్ కు “సుడిగాలి సుధీర్” అని పేరు పెట్టడం జరిగింది.

Dhee Program

ఆ తరువాత ‘dhee ప్రోగ్రాం’లో టీం లీడర్  అయ్యాడు. మరియు ‘పో వే పోరా’ ప్రోగ్రాంలకు హోస్ట్ గా నిలిచాడు. అలా సుధీర్ బుల్లితెర స్టార్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ తన తల్లి యొక్క కళ ను నెరవేర్చాడు. అలాగే సుధీర్ ఎంతో మందికి ఆర్థికంగా కూడా సహాయం చేసాడు.

 

Sudigali sudhir biography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *