small scale food processing business ideas

Food Business Ideas In India | Food Processing Business Ideas In India

 

small scale food processing business ideas
small scale food processing business ideas

మీరు ఫుడ్ వ్యాపారం చేయాలనీ అనుకుంటున్నారా… ఇప్పుడు మనం మంచి ఫుడ్ వ్యాపారాల గురించి తెలుసుకుందాం…? అలాగే ఈ బిజినెస్ వాళ్ళ మీరు మంచి పేరుప్రతిజ్ఞతలు తెచుకుంటారు…. ఇంకా మీరు పై స్థానానికి వెళ్తారు…. ఈ బిజినెస్ మీకు మంచి లాభం తెస్తాయని అనుకుంటున్నా….ఈ బిజినెస్ వాళ్ళ మంచి ఒక గొప్ప పేరు అలాగే గొప్ప స్థాయికి వెళ్తారు.. చాలా మంది ఫుడ్ బిజినెస్ చేయాలనీ అనుకుంటారు కాని ఎ వ్యాపారం తో చేస్తే ఎదుగుతాం అని చూసే వాళ్ళున్నారు… వారికి ఈ బిజినెస్ లాభం తెస్తుందని అనుకుంటున్నాFood Processing Business Ideas In India.

 

 ఫుడ్ బిజినెస్ ఐడియాFood Processing Business Ideas In India

 

ఫుడ్ బిజినెస్ లో కాస్త వినూత్నంగా ట్రై చేస్తే మనకు చక్కటి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో కొత్త ఐటమ్స్ పరిచయం చేస్తే మనకు కచ్చితంగా లాభాలు పండుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బిజినెస్ లకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అటు రెస్టారెంట్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్, కస్టమర్లకు మధ్య ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీకి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయిFood Processing Business Ideas In India.

 

క్లౌడ్ చికెన్

అందులో భాగమే వినూత్నమైన క్లౌడ్ కిచెన్ మోడల్ (cloud kitchen). ఒక రెస్టారెంట్ లేదా, హోటల్ ఏర్పాటు చేయాలంటే మంచి సెంటర్ లో ఎక్కువ అద్దె చెల్లించి స్పేస్ ఎంపిక చేసుకోవాలి. అందులో యాంబియన్స్ కోసం పెట్టుబడి పెట్టాలి. అలాగే రెస్టారెంట్ స్టాఫ్, ఇలా సవాలక్ష అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే క్లౌడ్ కిచెన్స్ అలా కాదు. ఒక మంచి హెల్తీ, హైజీన్ రెస్టారెంట్ స్టైల్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటే, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మీ ఫుడ్ ను కస్టమర్లకు అందించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో మీకు కస్టమర్లను ఆకర్షించేలా కమర్షియల్ సెంటర్ లో స్పేస్ తీసుకోవాల్సిన పని ఉండదు. ఆన్ లైన్ ఆర్డర్లకు తగ్గట్టుగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలు, లాభాలు దక్కుతాయి. (cloud kitchen)Food Processing Business Ideas In India

 

క్లౌడ్ చికెన్ ఇలా ఏర్పాటు చేసుకోండి

షాప్ లేదా ప్రాపర్టీ…విశాలమైన వెంటిలేషన్ ఉన్న గది అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ స్పేస్ కాకుండా, తక్కువ అద్దె చెల్లించేలా, నీటి సరఫరా పుష్కలంగా ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా ఉంటే మేలు. ఎలాగో ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారానే వ్యాపారం కాబట్టి కమర్షియల్ స్పేస్ కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు.
– అలాగే కిచెన్ ఏర్పాటుకు కమర్షియల్ కిచెన్ సామాగ్రి, ప్యాకేజింగ్ సామాగ్రి కొనుగోలు చేయాలి. దీని ఖర్చు సుమారు..రూ. 2 నుంచి 3 లక్షలు

– పీవోఎస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలి…దీని ధర రూ.25 వేలు

– లైసెన్స్ కోసం FSSAI license, GST Registration, Municipal health trade licenses, fire license సహా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది.

FSSAI license ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

– కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

– స్టాఫ్ కోసం యూనిఫార్మ్ మెయిన్ టెయిన్ చేయాల్సి. అలాగే శుభ్రత పాటించాలి.

– మొత్తం ఖర్చు. రూ. 5 లక్షల వరకూ అయ్యే చాన్స్ ఉంది. (అంచనా మాత్రమే)

 

క్లౌడ్ చికెన్ ద్వారా ఎలాంటి లాభాలు పొందావచ్చు

 

– క్లౌడ్ కిచెన్ (cloud kitchen) సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది.

– ఇందుకోసం సోషల్ మీడియాను వాడుకుంటే ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంది.

– అలాగే మార్కెట్లోని స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా వంటి ఫుడ్ అగ్రిగేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే మరింత మంచిది.

సదరు కంపెనీలు ఒక్కో ఆర్డరుపై మీ రెవెన్యూలో 10-25 శాతం వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ప్లేట్ బిర్యానీ రూ.150 నిర్ణయిస్తే, అందులో రూ.15 నుంచి రూ.30 చార్జీ చేస్తారు.

 

అంతేకాదు ఫోన్ కాల్స్ ద్వారా డైరక్టుగా 5 కిలోమీటర్ల లోపు నివాస ప్రాంతాలకు ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తే మీకు ఫుల్ మార్జిన్ మిగిలే అవకాశం ఉంది.

– డెలివరీ బాయ్స్ కు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంచుకోవాలి.

 

దీని ద్వారా ఎంత ఆదాయం ఉంటుంది

సాధారణంగా ఒక రెస్టారెంట్ లో ఫుడ్ మీద లాభం మార్జిన్ 3 నుంచి 5 శాతం ఉంటే, క్లౌడ్ కిచెన్స్ లో మాత్రం 10 శాతం మేర లాభం దక్కే చాన్స్ ఉంది.

ఒక కేస్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే…ఒక్కో క్లౌడ్ కిచెన్ పై, కనీసం నెలకు రూ. 10 లక్షలు అమ్మకాలు జరిగితే అన్ని ఖర్చులు పోను నెలకు రూ.2 నుంచి 3 లక్షల దాకా లాభం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. (అంచనా మాత్రమే)

– రెస్టారెంట్స్ నిర్ణీత సమయంలోనే ఫుడ్ అందుబాటులోకి తెస్తాయి. క్లౌడ్ కిచెన్స్ మాత్రం రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తే మరింత లాభాలు పొందవచ్చు. రుచి, శుభ్రత, మార్కెటింగ్ క్లౌడ్ కిచెన్ విజయ సూత్రం.ఇలా క్లౌడ్ చికెన్ ద్వారా ఎలాంటి లాభం పొందుతాం అనేది తెలుసుకున్నాం. అలాగే ఎలా ఏర్పాటు చేసుకోవాలి…. ఎలా మైంటైన్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం….

 

 

2. ఫుడ్ బిజినెస్ ఐడియా

ఫుడ్ బిజినెస్ రంగంలో టొమాటో కెచప్ తయారీది ప్రత్యేక స్థానం. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి టొమాటో కెచప్ తయారీ యూనిట్ చక్కటి అవకాశం అనే చెప్పాలి. ముందుగా టొమాటో కెచప్ పరిశ్రమ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. టొమాటో కెచప్ ప్రస్తుతం బాగా పేరుపొందిన పరిశ్రమగా మారింది.

బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ లో టొమాటో కెచప్ డిమాండ్ ఎక్కువ అయ్యింది. రోజువారి నిత్య అవసరాల్లో టొమాటో కెచప్ కూడా ఒక సాధనం అనే చెప్పాలి. టొమాటో కెచప్ పరిశ్రమ లో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. టొమాటో కెచప్ పరిశ్రమ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అయితే టొమాటో కెచప్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన యంత్రాలు ఏంటో తెలుసుకుందా.

 

టొమోటో కేచప్ కి ఎం ఎం అవసరం

టొమాటో కెచప్ పరిశ్రమకు మొత్తం ఏడు రకాల మిషిన్స్ కావాల్సి ఉంటుంది. 1. ఫ్రూట్ వాషింగ్ మిషిన్, 2. సార్టింగ్ మిషిన్, 3. క్రషింగ్ మిషిన్, 4. పల్పింగ్ మిషిన్, 5. కుకింగ్ మిషిన్, 6. హోమోజినైజర్, 7. బాటిల్ ఫిల్లర్, బాటిల్ వాషింగ్ మెషిన్, బాటిల్ కాప్ మిషిన్ అవసరం అవుతాయి.

 

ఎలాంటి రా మెటీరియల్స్ అవసరం

రా మెటీరియల్ విషయానికి వస్తే ఫ్రెష్ టొమాటోల అవసరం మనకు ఉంటుంది. చిల్లీ సాస్ తయారీకి పచ్చిమిరప, పండు మిరప అవసరం అవుతాయి. అలాగే ఫుడ్ కలర్స్, సాల్ట్, మసాలా దినుసులు, నీళ్లు అవసరం అవుతాయి. ఫ్రూట్ వాషింగ్ మిషిన్ ద్వారా టొమాటోలను శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. ఈ మిషిన్ ధర మీ యూనిట్ సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాలి. దీని ధర రూ. 2 లక్షల దాకా ఉంటుంది. అలాగే సార్టింగ్ మిషిన్, క్రషింగ్ మిషిన్, పల్పింగ్ మిషిన్, కుకింగ్ మిషిన్, హోమోజినైజర్, బాటిల్ ఫిల్లర్, బాటిల్ కాప్ మిషిన్ ఇలా మొత్తం ఒక సప్లై చెయిన్ ఏర్పాటు చేసుకోవచ్చు.

 

ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరం

ఈ బిజినెస్ మొదలు పెట్టేందుకు 1000 గజాల స్థలం అవసరం అవుతుంది. అందులో మంచి షెడ్ వేసుకోవాలి. ఇక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెమీ ఆటోమేటిక్ ( అంటే చిన్నతరహా ప్లాంట్) అయితే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.20 నుంచి రూ. 25 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది.

ప్రొడక్షన్ ఖర్చు విషయానికి వస్తే..మార్కెట్లో టమాటా ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇక యూనిట్ స్థాపించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తో పాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది.

లాభాలు ఎలా ఉంటాయో

ఒక కేజీ టమోటో సాస్ తయారీకి మనకు రూ. 75 ఖర్చు(ముడి సరుకు, లేబర్ చార్జీలు, కరెంట్, ట్రాన్స్ పోర్ట్) అవుతుంది. హోల్ సేల్ ధరలో మార్కెట్లో మనం రూ.85 వరకూ అమ్మవచ్చు. గంటకు 100 కేజీల టొమాటో కెచప్ తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే…అంటే గంటకు రూ.1000 లాభం పొందే వీలుండగా, రోజుకు 8 గంటల పాటు యూనిట్ నిడిపినప్పటికీ, రూ. 8000 ఆదాయం వస్తుంది.

5 లీటర్లు, 10 లీటర్ల క్యాన్స్ ద్వారా సరఫరా చేసేలా, ఫుడ్ కేటరింగ్ సర్వీసులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చైనీస్ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంటే, ఆర్డర్లు నిరంతంరం వచ్చే చాన్స్ ఉంది. అలాగే రిటైల్ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా కెచప్ అమ్మినట్లయితే మరింత ఆదాయం సమకూరుతుంది.

ఈ లెక్కన నెలకు రూ. 2 నుంచి రూ.5 లక్షల ఆదాయం పొందే వీలుంది. వ్యవసాయదారుల నుంచి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసినట్లయితే మార్కెట్ ధర కన్నా తక్కువ మొత్తంలో వస్తాయి. అలాగే ఖర్చులు కూడా మిగిలే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *