small business ideas in telugu

9 business ideas in Telugu | small business ideas in Telugu 2021

small business ideas in telugu
small business ideas in telugu

 

కరోనా యుగంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో చాలా మంది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఉద్యోగాలు పొందలేని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వారు చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చు. ప్రస్తుతం మనం అలాంటి వ్యాపారం యొక్క ఆలోచనను మేము మీకు ఇస్తున్నాము. ఇది ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం. కానీ ఇందులో లాభాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు ఈ వ్యాపారాన్ని కేవలం 50 వేల రూపాయలకు ప్రారంభించవచ్చు. దీని నుండి మీరు ప్రతి నెలా 30 నుండి 40 వేల రూపాయలు సంపాదించవచ్చుsmall business ideas in telugu 2021.

 

ప్రింటెడ్ టీ షర్ట్ బిజినెస్small business ideas in telugu 2021

ఈ రోజుల్లో టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.టీ-షర్టులను చిన్న స్థాయిలో ముద్రించే వ్యాపారం ఇది. పుట్టినరోజు సందర్భంగా, ప్రజలు తమ స్నేహితులకు లేదా బంధువులకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారికి ఈ బహుమతి ఉత్తమమైనది. అలాగే, పాఠశాలలు, కంపెనీలు మరియు కొన్ని ఇతర సంస్థలు ఇటువంటి ప్రత్యేక టీ-షర్టులను ముద్రిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాపారంలో ఆర్డర్లను పొందితే మాత్రం మంచి లాభాలను సంపాదించవచ్చుsmall business ideas in telugu 2021.

 

ఈ వ్యాపారం ఎంత పెట్టుబడితో ప్రారంభించవచ్చుsmall business ideas in telugu 2021

ఈ వ్యాపారాన్ని సుమారు 50-70 వేల రూపాయలతో ప్రారంభించవచ్చు. ఇదే పెట్టుబడిలో మీరు నెలకు 30-40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ముందుగానే మీరు కనుక మంచి కాంట్రాక్ట్స్ అందుకుంటే మాత్రం దాన్ని మీరు కేక్ మీద ఐసింగ్ పరిగణించండి. మీ ఆదాయాలు వేల రూపాయల నుండి లక్షల రూపాయలకు చేరుతాయి. మీరు సోషల్ మీడియా మరియు ఇ-కామర్స్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభిస్తే, మీ ఆదాయాలు మరింత పెరుగుతాయిsmall business ideas in telugu 2021.

ఎంత ఖర్చు, ఎంత లాభం..?

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీషర్ట్ ప్రింటింగ్ సాధారణ ముద్రణ యంత్రం 50 వేలతో ప్రారంభించవచ్చు. సాధారణ నాణ్యత గల తెల్లటి టీ-షర్టు ధర సుమారు 120 రూపాయలు. దీని ప్రింటింగ్ ఖర్చు కేవలం 1 నుండి 10 రూపాయల వరకు వస్తుంది మరియు ఒక ప్రింటెడ్ టీ షర్ట్ 250 నుండి 300 రూపాయలకు అమ్మవచ్చు. అంటే, మీరు ప్రతి టీ షర్టును రెట్టింపు లాభంతో అమ్మవచ్చు.

మాన్యువల్ మెషీన్లో 1 నిమిషంలో టీ-షర్టు ముద్రించబడుతుంది. ప్రతి రోజు మీరు 10-15 టీ-షర్టులను కూడా ప్రింట్ చేస్తే, అప్పుడు నెలలో 300-450 టీ-షర్టులు ముద్రించబడతాయి. ఈ సందర్భంలో, మీరు ఒక నెలలో 300-450 టీషర్ట్లను విక్రయించినట్లయితే, మీరు ప్రతి నెలా 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. మరోవైపు, మీరు చాలా పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే, మీరు ఆటోమేటిక్ మెషీన్ను కొనుగోలు చేయవచ్చు. ఇది కొంచెం ఖరీదైనది, కానీ మీ పనిని చాలా వేగంగా చేస్తుంది, ఇది మీ లాభాలను వేగంగా పెంచుతుంది.

వ్యవసాయం&ఉపాధి, డైలీ హంట్

స్వావలంబన సాధించాలంటే గ్రామీణ నిరుద్యోగాన్ని పారద్రోలాలి. ఇందుకు చక్కని మార్గం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో లెక్కకు మించి ఆధారపడ్డ వారికి ఇతరత్రా ఉద్యోగ అవకాశాలను స్థానికంగానే కల్పించటమే. చిన్న టౌన్లు, పల్లెల్లో స్త్రీ, పురుషులు ఎక్కువ మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అలాంటివారు స్వయం ఉపాధి (self employment) కింద చిన్నపాటి వ్యాపారాలు లేదా కుటీర పరిశ్రమలు ప్రారంభిస్తే అది వారికి లాభసాటిగా ఉండటమే కాదు.. ఇంకా తమతోటివారికి ఉపాధి లభిస్తుంది. మరి ఇలాంటి వాటికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలనే దిగులే వద్దు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి కింద సబ్సిడీతో కూడిన లోన్లు ఇస్తున్నాయి. అంతేకాదు “మేక్ ఇన్ ఇండియా” పథకం కింద నిధులు సమకూర్చుకోవటం, వాటిని మార్కెట్ చేయటం చాలా ఈజీగా మారింది…

 

లాక్ డౌన్ తరువాత ఎంతోమంది ప్రజలు పట్టణాలు వదిలి తమసొంతూళ్లకు వచ్చిచేరటంతో వీరు ఇప్పుడు ఉపాధి కోసం అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి వారికి స్వయం ఉపాధి కల్పిస్తే ఇక ఉన్నచోటే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. ఇంతకీ చిన్న ఊళ్లలో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు, అవి ఏమాత్రం లాభసాటిగా ఉంటాయో చూద్దాం….. !

 

కిరాణా దుకాణం

 

సాధారణంగా చిన్న ఊళ్లలో ఉంటున్నవారు తమకు కావాల్సిన నిత్యావసరాలన్నీ సమీపంలోని పెద్ద ఊరికి వెళ్లి తెచ్చుకుంటారు. ఇక పండగలు, పెళ్లిళ్లంటే కాస్త ఎక్కువ పరిమాణంలో వీటిని కొనాల్సిందే. ఇందుకు వీరంతా చుట్టుపక్కల ఉన్న పెద్ద ఊరికి వెళ్లి కొనకుండా చేస్తే మీరు ఉపాధి ఆర్జించవచ్చు. ఇందుకు మీరే ఓ చిన్నపాటి కిరాణా దుకాణం వంటి సూపర్ మార్కెట్ ను ప్రారంభించి, అన్ని సరుకులు అందుబాటులో పెట్టి, మంచి వ్యాపారం చేసుకోవచ్చు.

ముఖ్యంగా స్థానికంగా లభించే పళ్లు, కూరగాయలు కూడా మీరు మీ దుకాణంలో పెట్టవచ్చు. నిత్యావసర సరుకుల వ్యాపారం కోవిడ్ మహమ్మారి (covid-19 pandemic) సమయంలోనూ అత్యంత లాభసాటి వ్యాపారంగా నిలిచింది. దీనికి సీజన్ అస్సలు ఉండదు. కానీ సరుకులు అయిపోకుండా, చెడిపోని తాజా సరుకును మీరు మీ దుకాణంలో అందుబాటులో పెట్టి అవసరం అయిన కస్టమర్లకు డోర్ డెలివరీ ఇస్తూపోతే ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా కాసుల వర్షం కురిపిస్తుంది. మీరు దుకాణం పెట్టే ఊరిలో అత్యధిక కస్టమర్లు వేటిని డిమాండ్ చేస్తున్నారో ఆ సరుకులను ఎప్పుడూ అందుబాటులో పెడితేసరి మీ పేరు అతి కొన్నిరోజుల్లోనే ఇక్కడ మారుమోగిపోతుంది. చిన్నపాటి చిరుతిళ్లు, ఐస్ క్రీములు, బ్రెడ్ వంటివాటితో పాటు సెల్ఫోన్ రీచార్జ్ వంటివి కూడా అమ్మితే మీకు అదనపు ఆదాయం వచ్చి, మంచి గిట్టుబాటు అవుతుంది.

 

ఫ్లోరికల్చర్ (floriculture)

ఫ్లోరికల్చర్ అంటే పూలసాగు మంచి లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. కొన్ని పువ్వుల జాతి మొక్కలు కొన్నిప్రాంతాలు, కొన్ని వాతావరణంలోనే పెరుగుతాయి. కాబట్టి ఏడాదిపొడవునా డిమాండ్ ఉన్న పూలను పండించటం వాణిజ్య పంటల సాగులోకి వచ్చేసింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వివిధ రకాల పూలపంటలు పండిస్తూ, వాటిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

గులాబీ, డేరా, చేమంతి, మల్లె, కనకాంబరం వంటి ఎన్నో రకాల పువ్వులను పండించి, వాటిని మార్కెట్ కు చేర్చి లాభాలు కళ్లచూస్తున్న రైతుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసే పాలీ హౌసులు, గ్రీన్ హౌసులతో వీటిని భారీ ఎత్తున పండిస్తున్నారు. తాజా పూలతోపాటు ఎండిన పువ్వులను విదేశాలకు ఎగుమతి చేసే సదుపాయాలు భారీగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో పూలపెంపకం రైతులకు అదనపు ఆదాయాన్ని ఇస్తోంది. మందారం వంటి పువ్వులను ఎండబెట్టి ఆయుర్వేద కంపెనీలకు, తల నూనె తయారు చేసే కంపెనీలకు చేరవేస్తున్నారు. పువ్వుల అలంకారం ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగం అవటంతో వీటికి ఏడాదిపొడవునా డిమాండ్ ఉంటోంది.

పౌల్ట్రీ (poultry)

వ్యవసాయం కంటే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే కోళ్ల పెంపకం వంటివి చిన్న ఊళ్లలో తక్కువ ఖర్చుతోనే సాధ్యమవుతుంది. 12 వారాల్లోనే గుడ్లు పెట్టే జాతి కోళ్లు కూడా అందుబాటులోకి వచ్చాక పౌల్ట్రీ లాభసాటి వ్యాపారంగా మారింది. గుడ్లు, మాంసం స్థానికంగా లేదా చుట్టుపక్కల పట్టణాల్లో అమ్మేందుకు వీలుపడుతుంది. కనుక గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు వంటివాటి పెంపకం మంచి వ్యాపారం. మీకు నచ్చిన పక్షులను పెంచి వాటి ఉత్పత్తులను కూడా ప్రత్యేకంగా అమ్మవచ్చు. వీటిని చిన్న స్థాయిలో ప్రారంభించేందుకు ఎలాంటి లైసెన్సులు అవసరం లేదు.

 

ట్యూషన్ సర్వీసులు

స్కూల్ లేదా కాలేజ్ ఏదైనా ట్యూషన్లు చెప్పటం ఎప్పుడూ మంచి ఆప్షన్. చిన్న ఊళ్లలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి చక్కగా టీచ్ చేసేవారి కొరత అత్యధికం. క్యాట్, జీ మెయిన్, టోఫెల్, ఐఈఎల్టీఎస్, సీఏ, పోటీ పరీక్షలు, స్పోకన్ ఇంగ్లీష్.. ఇలా ఏమి చెప్పినా మీకు విద్యార్థులు ఈజీగా దొరుకుతారు.ఏడాదిపొడవునా మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ వంటి సబ్జెక్టులు నేర్చుకునేందుకు మీకు స్టూడెంట్స్ దొరుకుతారు కనుక ట్యూషన్లు చిన్న ఊళ్లలో మంచి లాభసాటి వ్యసనంగా పెట్టుకోవచ్చు.

ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు ఇలా టీచ్ చేయటం ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. బైజూ (Byju) వ్యవస్థాపకుడు రవీంద్రన్ కూడా కెరీర్ ఇలా మొదలు పెట్టినవారే. మ్యాథ్స్ కోచింగ్ ఇచ్చే రవీంద్రన్, తన అనుభవానికి టెక్నాలజీ జోడించి ఆతరువాతి కాలంలో కోట్లరూపాయల విలువైన బైజూ యాప్ అనే కంపెనీని ప్రారంభించారు. మీకు మంచి పట్టున్న సబ్జెక్టును మీరు చాలా చక్కగా టీచ్ చేయగలిగితే ఆన్ లైన్ ట్యూషన్లు కూడా చెప్పచ్చు, లేదా సొంతంగా చానెల్ కూడా ప్రారంభించి లాభాలు సంపాదించవచ్చు. మీరు ఎంత చిన్న ఊరిలో ఉన్నా డిజిటల్ ఎడ్యుకేషన్ మీకు కాసుల వర్షం కురిపించేలా చేస్తుంది.

 

కారు లేదా బైకు సర్వీసింగ్

చిన్న ఊళ్లలో కారు లేదా బైకు రిపేరీ చేయించుకోవాలంటే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. సమీపంలోని పట్టణానికి వెళ్తేకానీ ఇలాంటి సర్వీసులు దొరకవు. మరి మీరే ఎందుకు ఇలాంటి ఓ చిన్నపాటి గ్యారేజీని ప్రారంభించరాదు. టైర్లు మార్చటం, ఇంజిన్ రిపేరీలు, సర్వీసింగ్ వంటి ఎన్నో పనుల కోసం బైకులు, కార్ల యజమానులు తరచూ మీ సర్వీస్ సెంటర్ కు రావాల్సిందే. దీంతో మీకు ఉపాధి దొరుకుతుంది. ఈఎంఐ సదుపాయాలు వచ్చాక కార్లు, బైకులు లేని గ్రామాలు ఏవీ లేవు. మీకు ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి ఉన్నా, పట్టున్నా తక్షణం ఈ వ్యాపారం ప్రారంభిస్తే మీ ఊళ్లోని వాహనాలన్నీ మీదగ్గరికి వస్తాయి. స్పేర్ పార్ట్స్ అమ్మటం వంటివి కూడా ఇందులో చేర్చి ఏడాదిపొడవునా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.

బట్టల వ్యాపారం

చిన్న పల్లెల్లో ప్రతి చిన్న అవసరానికి దగ్గర్లోని పట్టణాలకు వెళ్లి కొనాల్సి వస్తుంది. ఇలాంటి వస్తువుల్లో బట్టలు కూడా ఒకటి. చిన్నా, పెద్దా అందరికీ కనీస అవసరమైన బట్టలను కొనాలంటే ఇలా టౌన్లకు వచ్చే వారికి మీరు సదుపాయం కల్పిస్తూనే మంచి ఆదాయవనరుగా మార్చుకోవాలంటే బట్టల వ్యాపారం ప్రారంభించటం మంచి ఆప్షన్. రెడీమేడ్ కూడా ఇందులో చేర్చితే ఇక మీకు తిరుగే ఉండదు. మీరుంటున్న ఊరులో ప్రజల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టు స్టాక్ పెడితే వ్యాపారం జోరుగా సాగుతుంది.

 

అరటి చిప్స్ వ్యాపారం

ఇటీవలి కాలంలో ఉద్యోగాల కంటే కూడా చాలా మంది వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా అనేక మంది వివిధ రంగాల్లో పని చేసే వారు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ప్రైవేటు రంగంలో పని చేసే వారు ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాపారం చేయడం మేలన్న నిర్ణయానికి అనేక మంది వచ్చారు. అయితే చాలా మంది వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉన్నా ఎలాంటి బిజినెస్ చేస్తే మంచిదో తెలియక గందరగోళానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు ఓ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా రోజుకు రూ. 4 వేల రూపాయల వరకు సంపాధించవచ్చు. అంటే నెలకు లక్ష రూపాయలకు పైగానే పొందొచ్చు

ఇంతకు ఆ వ్యాపారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే అరటి చిప్స్ బిజినెస్. ఇటీవలి కాలంలో బంగాళాదుంప చిప్స్ కంటే కూడా అరటి చిప్స్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఆరోగ్యానికి అరటి చిప్స్ మంచిదని, వాటిని ఖాళీ కడుపుతో తింటే మేలని వైద్య నిపుణులు చెబుతుండడంతో వాటి డిమాండ్ ఇటీవల అధికమైంది.

అరటి చిప్స్ యొక్క మార్కెట్ పరిమాణం చాలా చిన్నది. అందుకే పెద్ద కంపెనీలు అరటి చిప్స్ ను తయారు చేయవు. అందుకే ఈ వ్యాపారంలో మంచి స్కోప్ ఉంది. అరటి చిప్స్ తయారీకి వివిధ రకాల యంత్రాలు అవసరం ఉంటాయి. ముడి అరటిపండ్లు, ఉప్పు, నూనె మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు అరటి చిప్స్ తయారిలో అవసరపడుతాయి.

-అరటి వాషింగ్ ట్యాంక్ మరియు అరటి పీలింగ్ మెషిన్.
– అరటిపండ్లను సన్నని ముక్కలుగా కోసే యంత్రం.
– ముక్కలు వేయించడానికి యంత్రం.
– సుగంధ ద్రవ్యాలు కలపడానికి యంత్రం.
– సంచుల తయారీ పరికరం
– లాబరేటరీ పరికరం

అరటి వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఈ యంత్రాన్ని అంటే మెషిన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ యంత్రాన్ని ఉంచడానికి మీకు కనీసం 4000 నుండి 5000 చ. అడుగుల స్థలం అవసరం. మీరు ఈ యంత్రాన్ని సుమారు 28 నుండి 50 వేల వరకు పొందొచ్చు.

50 కిలోల చిప్స్ తయారు చేయడానికి కనీసం 120 కిలోల అరటిపండ్లు అవసరం. ఇవి మీకు హోల్ సేల్ గా కొంటే సుమారు రూ. 1000 రూపాయలకు లభిస్తాయి. మీకు 12 నుండి 15 లీటర్ల నూనె కూడా అవసరం. 15 లీటర్ల నూనె అవసరం. ఇందుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది.

ముఖ్యంగా.. చిప్స్ ఫ్రైయర్ 1 గంటలో 10 నుండి 11 లీటర్ల డీజిల్‌ను కాల్చేస్తుంది. లీటరుకు రూ. 90 చొప్పున లెక్కిస్తే, 11 లీటర్ డీజిల్ ధర రూ. 990 అవుతుంది. ఉప్పు, సుగంధ ద్రవ్యాలకు గరిష్టంగా రూ . 50 నుంచి రూ. 100 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి 50 కిలోల చిప్స్ తయారీకి కేవలం రూ. 3500 వరకు ఖర్చు అవుతుంది. అంటే.. ఒక కిలో ప్యాకెట్ చిప్స్ కు రూ .70 ఖర్చు అవుతుంది. వీటిని మీరు ఆన్‌లైన్‌లో లేదా కిరాణా దుకాణాల్లో రూ. 90 నుంచి రూ. 100 వరకు సులువుగా అమ్మేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *