విశ్వనాథన్ ఆనంద్

Indian chess champion

Personal information

పూర్తి పేరు :విశ్వనాథన్ ఆనంద్

పుట్టినతేదీ : 11 డిసెంబర్, 1969

స్థలం         : తమిళనాడు

తండ్రి        : కృష్ణమూర్తి విశ్వనాథన్

తల్లి          : సుశీల

భార్య       : అరుణ

క్రీడా          : చెస్ (చదరంగం)

తల్లిదండ్రులు..

విశ్వనాథన్ ఆనంద్ ఒక మంచి దిగ్గజా చెస్(చదరంగం) ఆటగాడు, ఇతను 11 డిసెంబర్ 1969 న తమిళనాడు లోని చెన్నైలో జన్మించాడు. విశ్వనాథన్ ఆనంద్ యొక్క తల్లిదండ్రులు కృష్ణమూర్తి విశ్వనాథన్ మరియు సుశీల. కృష్ణమూర్తి విశ్వనాథన్ భారతదేశంలో దక్షిణ రైల్వేలో జనరల్ మేనేజర్ గా పని చేసేవాడు. ఇతని తల్లి సుశీల గృహిణి గా ఉంటుంది. విశ్వనాథన్ ఆనంద్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు.

చదువు / Education

విశ్వనాథన్ ఆనంద్ తన పదవ తరగతి వరకు చెన్నై లోని డాన్ బాస్కో మెట్రిక్కులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదవడం జరిగింది. ఆ తరువాత తన కాలేజ్ ను చెన్నై లోని లయోలా లో పూర్తి చేశాడు.

చేస్ / Chess

విశ్వనాథన్ ఆనంద్ తల్లి పేరు సుశీల ఆమెకు చెస్ (చదరంగం) అంటే చాలా అభిమానం కలిగి ఉండేది. అందుకని విశ్వనాథన్ ఆనంద్ ను చెస్ అడమని ప్రోత్సహించడం జరిగింది. మరియు చెస్ అంటే చాలా ఇష్టం కలిగే విదంగా చెప్పింది.

విశ్వనాథన్ ఆనంద్ అతి చిన్న వయసులోనే అంటే అతనికి 6 సంవత్సరం లొనే  చెస్ ఆడటం మొదలుపెట్టాడు.

తల్లి సుశీల ఆనంద్ ను చాలా ప్రేరేపించింది. విశ్వనాథన్ ఆనంద్ తన 14 సంవత్సరం లొనే చాలా కష్టపడి జాతీయ సబ్ జూనియర్ చెస్ ఆటలో ఒక మంచి ఉత్తముడిగా నిలిచాడు.

అంతర్జాతీయం / International master title

విశ్వనాథన్ ఆనంద్ తన 15 సంవత్సరాల ఏళ్ల వయస్సు లో హాంకాంగ్ లో జరిగిన ఆసియాలో జూనియర్ ఛాంపియన్షిప్ సాధించాడు. దాని ద్వారా ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ను సంపాదించాడు.

అతనికి 16 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు మన దేశానికే ఒక చెస్(చదరంగం) క్రీడా కు ఛాంపియన్ అయ్యాడు.

గ్రాండ్ మాస్టర్ టైటిల్ / Grand master Title

విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ జూనియర్ చెస్ ఆటలో గెలిచి ఛాంపియన్ ను పొందాడు. తన 18 సంవత్సరం రాల వయస్సులో మన భారతదేశంనికే ఒక మొట్ట మొదటిసారిగా గ్రాండ్ మాస్టర్ గా నిలిచిపోయాడు.  అతి చిన్న వయస్సులొనే గ్రాండ్ మాస్టర్ అవ్వటం మన దేశనికే  ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు.

చేస్ ఛాంపియన్ మర్రైడ్ లైఫ్ / chess champion Married life

విశ్వనాథన్ ఆనంద్ అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  ఆ తరువాత ఒక కొడుకు కూడా పుట్టాడు, అతని పేరు  అఖిల్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ ఆ తరువాత చాలా కష్టపడ్డాడు.

విశ్వనాథన్ ఒలంపిక్స్ / chess Olympics

1) 1991 వ సంవత్సరం లో క్వార్టర్ ఫైనల్లోకి చేరి కార్డోవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అప్పుడు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ FIDE ను గెలవలని అనుకున్నాడు, కానీ ఓడిపోవడం జరిగింది.

2) 1995 వ సంవత్సరం లో కాస్పరోవ్ తో ఆడి PCA  వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో విశ్వనాథన్ ఆనంద్ ఓడిపోయాడు.

3) 1998వ సంవత్సరం లో విశ్వనాథన్ ఆనంద్ మైఖేల్ ఆడమ్స్ ను ఓడించి ఫైనల్స్ లోకి వెళ్ళాడు.

4) 2000 వ  సంవత్సరం లో అలెక్సి షిరోవ్ ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో తన మొదట టైటిల్ ను సంపాదించాడు విశ్వనాథన్ ఆనంద్.

5) 2002 వ సంవత్సరం లో రస్యా కు చెందిన ఇవాన్ చుక్ తో ఆడి  ఓడిపోయాడు విశ్వనాథన్ ఆనంద్.

6) 2006 వ సంవత్సరం లో  ఆనంద్ 2800 మార్కులు దాటి ELO రేటింగ్స్ లో ప్రపంచంలో నాల్గవ ఆటగాడిగా నిలిచాడు.

విశ్వనాథన్ ఆనంద్ తన 2007 సంవత్సరం నుండి 2013 సంవత్సరం దాకా తన ఆటలో ప్రతిభ చూపించి ప్రపంచంలో నే ఒక మంచి చెస్ (చదరంగం) ఆటగాడిగా మరియు బహుముఖ ఆటగాడిగా నిలిచిపోయాడు.

విశ్వనాథన్ ఆనంద్ అతి చిన్న వయస్సు లోనే మన భారతదేశం లోనే గ్రాండ్ మాస్టర్ గా పేరుపొందిన వాడు. అంతే కాకుండా తన ఆటను చూసి తనకి “మెరుపుకిడ్” అని పిలిచే వారు. విశ్వనాథన్ ఆనంద్ ఆటను “స్పీడ్ చెస్ “ అని కూడా పిలిచేవారు.

చేస్ ఛాంపియన్ అవార్డ్స్ / chess champion awards

విశ్వనాథన్ ఆనంద్ ఎన్నో  అవార్డ్ లను అందుకున్నాడు. అందులో 1985వ సంవత్సరం లో అర్జున అవార్డ్ తీసుకోవడం జరిగింది.

1987లో మూడు అవార్డ్ లను తీసుకున్నాడు. అవి పద్మశ్రీ , నేషనల్ సిటిజన్స్ అవార్డ్ మరియు సోవోయట్ ల్యాండ్ నెహ్రు అవార్డ్.

1991 వ సంవత్సరం లో ఆయన రాజీవ్ గాంధి ఖేల్ రత్న అవార్డ్ తీసుకున్నారు.

1991 వ సంవత్సరం లో ఉత్తమ క్రీడ కారుడి అవార్డ్ గ్రహించారు.

2001 లో పద్మభూషణ్ అవార్డ్ తీసుకున్నారు. ఇంకా 2003 , 2004 , 2007 మరియు 2008 వ సంవత్సరం లో విశ్వనాథన్ ఆనంద్  చెస్ ఆస్కార్ ను తీసుకున్నారు.  మరల 2008 లో పద్మవిభూషణ్ అవార్డ్ ను గ్రహించారు.

విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఐదుసార్లు గెలిచాడు. మరియు ప్రపంచంలోని ఒకటో నెంబర్ ఛాంపియన్ గా నిలిచాడు.

విశ్వనాథన్ ఆనంద్ తన క్రీడా ను నమ్మి వృత్తి గా చేసుకున్నాడు. ఎన్నో తరాలను స్ఫూర్తిని ఇస్తున్నాడు. ఇతను మన భారతదేశ గొప్ప క్రీడాకారులలో ఒకరని చెప్పవచ్చు.

World chess champion vs Charles,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *