నిరుద్యోగులకు శుభవార్త …ఒక పరీక్ష పది ఉద్యోగాలు…!!

గ్రామీణ ప్రాంతాల్లో నివసించి  ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే నిరుద్యోగ పేద విద్యార్థులకు ఈ  NRA అనే ఉమ్మడి పరీక్ష ఒక మంచి శుభవార్త  అనే అనుకోవాలి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాదించి దేశవ్యాప్తంగా సర్వీసు చేయాలని చాలా మందికి ఉంటుంది.కానీ చిన్న నాటి నుంచి ప్రాంతీయ భాషల్లో  చదువుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాదీంచాలని ఉండి ఆంగ్లంపై,హింది భాషపా పట్టు లేకపోవడంతో పరీక్షలో ప్రశ్నలు అర్దం అవ్వకుండా సరిగ్గా రాయలేక మార్కులు సరిపోయేంత రాకపోయేవి.ఇప్పుడు ఆ స్థితికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం మంచి ఊరటనిస్థుంది అని చెప్పుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి చేరువయ్యేలా, సులువుగా అర్ధం అయ్యే రీతిలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానమే జాతీయ రిక్రూట్ మెంట్  సంస్థ (National Recruitment Agency).

మనకు ఎలా ఉపయోగపడుతుంది ?

 

ఒక పరీక్ష 10 ఉద్యోగాలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా  RRB ,SSB , IBPS  ఉద్యోగాలకు వేరు వేరుగా పరీక్షలు ఉండేవి. మరియు ఒకే పరీక్షను 3 రకాలుగా టైర్ 1,టైర్ 2,టైర్ 3 గా నిర్వహించేవారు. అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్షను నిర్వహించే విధంగా ఈ జాతీయ రిక్రూట్ మెంట్ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు.ప్రస్తుతం 3 నియామక సంస్థలను తీసుకువచ్చి తరువాత రాబోవు కాలంలో 20 నియామక సంస్థంను ప్రవేశ పెట్టడం జరుగుతుంది.అంతేకాకుండ ప్రభుత్వరంగా, ప్రయివేటు రంగా సంస్థలు వీటి ఆధారంగా నియమకాలు  చేపట్టవచ్చును.

ఇలా ఉంటె మన అక్షరాస్యత పెరుగుతుంది

ఈ జాతీయ రిక్రూట్మేంట్ సంస్థ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ.దీనికి చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి, అధికారులు సభ్యులుగా ఉంటారు.ఈ విధానంలో మొదటగా ప్రిలిమినరీ స్థాయిలో పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు.తరువాత వారికి వచ్చిన మార్కులను తక్కువ కాలంలోనే ప్రకటిస్తారు.దీని ఆధారంగా అభ్యర్థులు సంస్థల్లో  ఏ ఉద్యోగానికైనా  ధరఖాస్తు చేసుకోవచ్చు.తరువాత ఆ ఉద్యోగం యొక్క ఒకే ఒక మెయిన్స్ పరీక్షను రాసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పరీక్షను సంవత్సరములో రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల అధారంగా 3 సంవత్సరముల వరకు ఏ ఉద్యోగానికైనా ధరఖాస్తు చేసుకోవచ్చును.ఈ యొక్క పరీక్ష  దేశంలోని 12 వివిధ భాషల్లో జరుగుతుంది.మిగతా భాషలను రాబోవు కాలంలో చేరుస్తారు.అభ్యర్థులు ఆ ఉద్యోగం యొక్క గరిష్ఠ వయోపరిమితి వరకు ఎన్ని సార్లయినా ధరఖాస్తు చేసుకొవచ్చు.ఎస్ సి, ఎస్ టి,ఒబిసి,దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.ఈ పరీక్ష స్థాయి పదో తరగతి,ఇంటర్,డిగ్రి స్థాయిలో ఉంటాయి.అన్ని ప్రాథమిక పరీక్షలకు ఒకే సిలబస్ ఉంటుంది.ప్రతి జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉంటుంది, ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలో అవసరమయితే రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.117 ఆకాంక్షిత జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేకముగా సహాయము అందిస్తారు.అదే విధంగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా హెల్ప్ లైన్ నంబర్ ని అందుబాటులో ఉంచుతారు. అవసరమైన వసతుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వ్యయ సర్దుబాటు నిధి ఇస్థుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *